AP High Court: పంచ్‌ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలి : హైకోర్టు

సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు.

AP High Court: పంచ్‌ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలి : హైకోర్టు

Ap Hc Gives Cbi 10 Days To Nab 'punch Prabhakar'

Punch Prabhakar Arrest : సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు సీబీఐకి తుదిగడువు ఇచ్చింది. చేతకాకపోతే చెప్పాలని.. సిట్ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు నివేదిస్తామని, సీబీఐకి హైకోర్టు తేల్చేసి చెప్పింది. అంతేకాదు… ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ ను ఏపీహైకోర్టు ఆదేశించింది. విఫలమైతే మీకు దర్యాప్తు చేతకావడం లేదని భావించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేయగా.. విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. అసభ్యకర పోస్టులపై అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) దాఖలుచేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. దానిపై స్పందించిన ధర్మాసనం.. న్యాయస్థానాన్ని అపకీర్తిపాలు చేసే పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు వెంటనే.. సోషల్ మీడియాల్లోని ఆ పోస్టులను డిలీట్ చేయాల్సిన పని లేదా? ప్రశ్నించింది. పోస్టులు పెట్టిన రెండేళ్ల తర్వాత వాటిని తొలగిస్తే ఏం ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించింది.
Read Also : Dengue Outbreak: డెంగీ డేంజర్ బెల్స్.. కేంద్రం హైఅలర్ట్.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

సీబీఐ తరఫున పి.సుభాష్ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాల్లో వీడియోలు తొలగించాలని గూగుల్‌కు లేఖలు రాసినట్టు తెలిపారు. అందుకు గూగుల్.. ఆ పోస్టులు పెట్టిన నిందితులనే తొలగించాలని బతిమాలుకోవాలని సమాధానం ఇచ్చిందన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామన్నారు. దర్యాప్తు సజావుగానే కొనసాగుతోందన్నారు. సీబీఐ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మిమ్మల్ని ఎవరు బతిమాలమన్నారు? చేతకాకపోతే చెప్పండి.. సిట్ ఏర్పాటుచేస్తామని సీబీఐని హెచ్చరించింది. దాంతో నాలుగు వారాల సమయం ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ విమలాదిత్య కోరారు. పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయడానికి 3 రోజులు మాత్రమే సమయం ఇస్తామని, లేదంటే సీడీఐ డైరెక్టర్ హాజరుకావాలని హెచ్చరించింది. మరింత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ కోరడంతో ఏపీ హైకోర్టు ధర్మాసనం పది రోజుల సమయం ఇచ్చింది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడమే కాకుండా, చర్చలు జరిపిన 93 మందిపై సుమోటో నమోదు చేయగా.. కోర్టుధిక్కరణ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు అందుకున్నా వ్యక్తిగతంగా రాలేదని, న్యాయవాదిని నియమించుకోలేదంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని పేర్కొంది. చివరి అవకాశం ఇస్తున్నామనంటూ విచారణను నవంబరు 23కి వాయిదా వేసింది.
Read Also : Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు